1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Kadiri Hospital : husband kills wife with knife

మెరుగైన చికిత్స చేయిస్తానని చెప్పి కదిరి ఆస్పత్రిలో భార్యను హత్య చేసిన భర్త

knife
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో దారుణం జరిగింది. ముదిగుప్ప మండలం, ఈదులపల్లికి చెందిన గంగరాజు తన భార్య సునీత (32)ను ఆస్పత్రి ఆవరణంలోనే హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు... దంపతుల మధ్య జరిగిన గొడవలో గంగరాలు తన భార్యను చితకబాదాడు. 
 
గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు కదిరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళదామని భార్యను నమ్మించి, ఆస్పత్రి నుంచి బయటకు తీసుకొచ్చి, తన వద్ద ఉన్న కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
సమోసాల కోసం రైలు దిగిన లోకో పైలట్... (వీడియో)