1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Husband Kills Wife in Uppal, Flees Scene

భార్య ప్రవర్తనలో మార్పు.. అనుమానం.. చంపేసిన భర్త.. ఎక్కడ?

Crime
భార్య ప్రవర్తనలో మార్పు కారణంగా, ఆమెపై వున్న అనుమానంతో ఓ వ్యక్తి హంతకుడిగా మారాడు. తాజాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆదర్శ్‌నగర్‌లో గృహహింసకు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది.
 
ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం, క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి, తన భార్య జెస్సికా ప్రవర్తనపై అనుమానంతో ఆమెను హత్య చేసినట్లు భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. 
 
నేరానికి పాల్పడిన అనంతరం సురేష్ అక్కడి నుంచి పారిపోవడంతో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
నూడుల్స్ వల్ల చాపకింద నీరులా వ్యాపిస్తున్న బ్యాక్టీరియా.. 49మంది పరిస్థితి విషమం