మంగళవారం, 3 మార్చి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మార్చి 2026 (19:05 IST)

హోలీ మార్చి 4వ తేదీన జరుపుకోవాలట.. ఎందుకంటే.. సంపూర్ణ చంద్రగ్రహణం?

Holi 2026
Holi 2026
హోలీ పండుగ సాధారణంగా ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుగుతుంది. అదే రోజు చంద్రగ్రహణం ఉంటే, ఆ పండుగను గ్రహణం తర్వాతి రోజు లేదా శుభ ముహూర్తంలో జరుపుకోవాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. చంద్రగ్రహణానికి సుమారు 9 గంటల ముందే సూతక కాలం ప్రారంభమవుతుంది. 
 
గ్రహణం పూర్తయ్యే వరకు ఈ సూతకం కొనసాగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ సమయంలో వర్ణాలు వేసుకోవడం, ఆహారం తీసుకోవడం, పూజలు చేయడం, ఆనంద వేడుకలు నిర్వహించడం మంచిది కాదని జోతిష్య పండితులు అంటున్నారు.
 
అందుకే సంప్రదాయాలను పాటించే కుటుంబాల్లో హోలీ వేడుకలను మార్చి 4వ తేదీ, లేదా గ్రహణం పూర్తయ్యాక వచ్చే శుభ ముహూర్తంలో జరుపుకోవాలని భావిస్తారు. 2026 సంవత్సరంలో హోలికా దహనం మార్చి 2న జరుపుకున్నారు. హోలీ రోజు రాత్రి సమయంలో ధ్యానం, జపం, పూజ, దీపాలు వెలిగించడం సర్వాభీష్టాలను చేకూరుస్తుంది.
 
హోలీ రాత్రి, రావి చెట్టు కింద దీపం వెలిగించి, దాని చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల, జీవితం నుంచి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. హోలీ రాత్రి, ఇంటికి నైరుతి దిశలో దీపం వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి, ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. హోలీ పండుగ రాత్రి, తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణం కొనసాగించడానికి సహాయపడుతుంది.