సంబంధిత వార్తలు
- Virosh Reception: విరోష్ పెళ్లి రిసెప్షన్ పరిమిత ఆహ్వానితులకు మాత్రమే
- ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య
- మద్యపానంతో భార్యాభర్తలు గొడవలు.. నలుగురు సభ్యుల మిస్సింగ్
- లిఫ్టు పేరుతో బాలికను నమ్మించి అత్యాచారానికి పాల్పడిన యువకులు
- మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు
బాచుపల్లి ఇంజనీరింగ్ స్టూడెంట్‌పై దారుణం.. మత్తుమందిచ్చి లైంగిక దాడి
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలేజీ విద్యార్థినిపై లైంగికంగా దాడికి పాల్పడటమే కాకుండా మాట వినకుంటే నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని ఆమెను బెదిరించాడు.
అతడి వేధింపులు తాళలేక సదరు యువతి శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో విషయం తెలసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఆశిష్ అనే విద్యార్థి గత ఏడాది కాలంగా ఏఎన్‌సీ అనే డార్క్ వెబ్ నుండి తన కూతురికి చాక్లెట్లు, టాబ్లెట్లు ఇచ్చి కాలేజ్, హోటల్లో లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆశిష్ అతని స్నేహితుడు ప్రవీణ్ కూడా వరుసగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపింది.
