1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 05-01-2025 Daily Astrology

05-01-2026 సోమవారం ఫలితాలు - ధనసహాయం, చెల్లింపులు తగవు...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
పరిచయాలు బలపడతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ధనసహాయం, చెల్లింపులు తగవు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఉభయులకూ చక్కని సలహాలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. అనవసర జోక్యం తగదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికస్థితి సామాన్యం. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అన్యమస్కంగా గడుపుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కుంటారు. ఆప్తులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభవార్త వింటారు. యత్నాలు ఫలిస్తాయి. పదవులు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పందాలు, పోటీల్లో అత్యుత్సాహం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పోటీల్లో మహిళలు విజయం సాధిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. సన్నిహితులతో సంభాషిస్తారు. పత్రాలు అందుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. పట్టుదలతో శ్రమించండి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. ప్రయాణం విరమించుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలదాయకం. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్ళు తప్పవు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. ఖర్చులు విపరీతం. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ప్రయాణం కలిసివస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పందాలు, పోటీల్లో అత్యుత్సాహం తగదు. 
About Writer
రామన్
తర్వాతి కథనం
గోరింటాకు చెట్టుకు సీతమ్మకు ఏంటి సంబంధం.. గోరింటాకు చెట్టును పూజిస్తే?