సంబంధిత వార్తలు
- 30-12-2025 మంగళవారం ఫలితాలు - ఆశయసాధనకు ఓర్పుతో శ్రమించండి...
- 29-12-2025 సోమవారం ఫలితాలు - గ్రహబలం అనుకూలంగా లేదు.. భేషజాలకు పోవద్దు...
- 28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...
- 27-12-2025 శనివారం ఫలితాలు - నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...
- 26-12-2025 శుక్రవారం ఫలితాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...
31-12-2025 బుధవారం ఫలితాలు - పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. ఆప్తులు ఆదుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శ్రమించిన కొద్దీ మంచి ఫలితాలుంటాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పెద్దల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. ధృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
రావలసిన ధనం అందదు. అవసరాలు నెరవేరవు. నిరుత్సాహానికి గురవుతారు. చిన్న చిన్న ఒత్తిళ్లున్నా మనోధైర్యం కోల్పోవద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయం తగదు. పెద్దల సలహా తీసుకోండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యం సిద్ధిస్తుంది. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. లౌక్యంగా మెలగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఖర్చులు అధికం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కొత్త యత్నాలు మొదలెడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
విశేష ఫలితాలున్నాయి. అనుకున్న కార్యం సాధిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వేడుకను ఘనంగా చేస్తారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఒత్తిళ్లకు గురికావద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. లావాదేవీల్లో మెలకువ వహించండి. అనుభవజ్ఞులను సంప్రదించండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఇతరులను నిందించవద్దు. ధృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. బంధుమిత్రులతో సంభాషిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలు అధికం. లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పధంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలను అధిగమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. సోదరీ సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. సమర్ధతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. శుభకార్యం తలపెడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమస్యలను నిబ్బరంగా ఎదుర్కుంటారు. మీ కార్యదీక్ష ప్రశంనీయమవుతుంది. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కొత్తవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు.
