28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. శ్రమించినా ఫలితం శూన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఆకస్మిక ఖర్చు చికాకుపరుస్తుంది. చేబదుళ్లు తప్పవు. పనులు మందకొడిగా సాగుతాయి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులను ఆకట్టుకుంటారు. సంప్రదింపులకు తగిన సమయం. దుబారా ఖర్చులు విపరీతం. కొందరి రాక చికాకుపరుస్తుంది. కార్యక్రమాలు సాగవు. ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సంకల్పం సిద్ధిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను అయిన వారు ప్రోత్సహిస్తారు. అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. వాయిదా పడుతూ వస్తున్న మొక్కులు తీర్చుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అవకాశాలను దక్కించుకుంటారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పొదుపు ధనం అందుతుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. ఆప్తులు సాయం అందిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పరిచయం లేని వారితో జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గుట్టుగా మెలగండి. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. గృహమరమ్మతులు చేపడతారు. చుట్టుపక్కల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాల్లో మెలకువ వహించండి. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. కృషి ఫలించకున్నా అధైర్యపడవద్దు. శుభవార్త వింటారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. చీటికిమాటికి చికాకుపడతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. ఇతరుల బాధ్యతలు చేపట్టిన ఇబ్బందులెదుర్కుంటారు. తీర్ధయాత్రకు సన్నాహాలు సాగిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలమే. మీ కృషి ఫలిస్తుంది. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు విపరీతం. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. చెల్లింపుల్లో జాప్యం తగదు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.
