బుధవారం, 24 డిశెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Modified: మంగళవారం, 23 డిశెంబరు 2025 (04:07 IST)

డిశెంబరు 23 మీ రాశి ఫలితాలు, మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది

Astrology
మేషం: అశ్వని, భరణి, 1,2,3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం
నేడు అనుకూలం. ఆలోచనల్లో మార్పు వస్తుంది. స్థిరాస్తి ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
వృషభం కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సమర్థత ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. వాయిదా పడుతూ వస్తున్న మొక్కులు తీర్చుకుంటారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలకు శ్రీకారం చుడతారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. సన్నిహితులతో సంభాషణ మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. స్థిరాస్థి ధనం అందుతుంది. ధనసహాయం తగదు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. చేపట్టిన పనలు మొండిగా పూర్తి చేస్తారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు ఓ పట్టాన పూర్తికావు. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. అవకాశాలు చేజారిపోతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. కార్యసాధనకు మరింత కష్టపడాలి. మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆపేయవద్దు. ముఖ్యుల కలయిక వీలుకాదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు కలిసి వస్తాయి. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. ఆదాయానికి తగ్గట్లు ఖర్చులుంటాయి. కొందరి వ్యాఖ్యలు ఆలోచిపంజేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. పందేలు, క్రీడా పోటీల్లో రాణిస్తారు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
మనోభీష్టం సిద్ధిస్తుంది. వాక్చాతుర్యంతో రాణస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. అప్రియమైన వార్త వింటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలమే. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనోధైర్యంతో శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. స్థిరాస్తి ధనం అందుతుంది. మీ యత్నాలకు కొందరు అవరోధం కలిగిస్తారు. పనులు స్వయంగా చూసుకోండి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక వుండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ కృషి తక్షణమే ఫలిస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వాహనం, విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. వ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా వుండాలి.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మొండిధైర్యంతో అడుగు ముందుకేస్తారు. శ్రమ ఫలించకున్నా నిరుత్సాహపడవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ప్రయాణంలో జాగ్రత్త.