1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 19-12-2025 Daily Astrology

19-12-2025 శుక్రవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలంగా లేదు.. ఆచితూచి అడుగేయండి...

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఆచితూచి అడుగేయండి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. కష్టించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు సాగవు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. పనులు మధ్యలో నిలిపివేయవద్దు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. పత్రాలు అందుకుంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతోషకరమైన వార్త వింటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందుతారు. సన్నిహితులకు సహాయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. పొదుపు ధనం అందుతుంది. పొగిడే వారితో జాగ్రత్త. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కీలక సమావేశంలో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అనుకూలతలు అంతంత మాత్రమే. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. చిన్న విషయానికే చికాకుపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఇంటి విషయాల పట్ల శ్రద్ధవహించండి. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పన్ను చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో ముందుకు సాగండి. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ప్రముఖులకు చేరువవుతారు. కీలక పత్రాలు అందుకుంటారు. పనులు పురమాయించవద్దు. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణం తలపెడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికంగా బాగుంటుంది. రుణసమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. పెట్టుబడులపై దృష్టిపెడతారు. లావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. పనులు పురమాయించవద్దు. అనుకోని ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు కొలిక్కిస్తాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల స్ఫూర్తిదాయకమవుతుంది. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. మధ్య స్వల్ప కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
About Writer
రామన్
తర్వాతి కథనం
Annavaram Temple: అన్నవరంలో ఆన్‌లైన్ సేవలకు ప్రాధాన్యత.. వాట్సాప్‌లో బుకింగ్