1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 17-12-2025 Daily Astrology

17-12-2025 బుధవారం ఫలితాలు - రుణవిముక్తులవుతారు. తాకట్టు విడిపించుకుంటారు

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆదాయం అంతంతమాత్రమే. ఖర్చులు అదుపులో ఉండవు. చేబదుళ్లు స్వీకరిస్తారు. సన్నిహితుల సాయంతో అవసరం తీరుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కష్టం ఫలిస్తుంది. వాహనసౌఖ్యం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు ధనం అందుకుంటారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. దంపతుల మధ్య సుఖ్యత నెలకొంటుంది. కొత్తయత్నాలు మొదలెడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు శుభకార్యానికి హాజరవుతాడు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహస్థితి బాగుంది. అనుకున్నది సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. పనులు చక్కబెట్టుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం వేడుకకు హాజరవుతారు. ప్రయాణ లక్ష్యం  నెరవేరుతుంది. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అనుకూలతలున్నాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ఆశావహదృవడంతో మెలగండి. మీ కృషి కలిగిస్తుంది. బడ్జెట్ రూపొందించుకుంటారు. పసులు, బాధ్యతలు అప్పగించవద్దు, కొత్త వ్యక్తులతో జాగ్రత్త, పత్రాల రెన్యువల్‌లో జాగ్రత్త అవసరం. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. సంకల్పం మీ విజయానికి తోడ్పడుతుంది. దంపతుల మధ్య అకారణ కలహం. చిన్న విషయాలను పెద్దవి చేసుకోవద్దు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణవిముక్తులవుతారు. తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య పరస్పర అవగాహన నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అనుకున్న మొక్కుల తీర్చుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహసంచారం బాగుంది. ధైర్యంగా అడుగు ముందుకేయండి. మీ కష్టం వృధా కాదు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతి విషయంలోను మీదే పైచేయి. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. అవసరాలకు ఖర్చుచేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. మీ సామర్థ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సలహా ఉభయులకు ఆమోదయోగ్యమవుతుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకున్న లక్ష్మణ సాధిస్తారు. మీ కృషి స్ఫూర్తిదాయకమవుతుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. వ్యవహారాలతో వీటికి ఉండదు. ఆదాయం బాగుంటుంది. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనవసర ఒత్తిడికి గురికావద్దు. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులు సామాన్యం. కొంత మొత్తం పొదుపు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకూలతలు అంతంత మాత్రమే శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతనుపుతారు. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ఫోన్ సందేశాలు వట్టించుకోవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు.
About Writer
రామన్
తర్వాతి కథనం
శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు.. మిథునరాశి వారికి.. ఆదాయం ఎంత?