మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి. సాయం అర్ధించవద్దు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వాక్చాతుర్యంతోనెట్టుకొస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలు ప్రాంభిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురికాకుండా మెలగండి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. ధనయోగం, వస్తులాభం ఉన్నాయి. తాకట్టు విడిపించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్తపనులు చేపడతారు. ఖర్చులు అధికం. అనవసర జోక్యం తగదు. ఏ పనీ చేయబుద్ధికాదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యాన్ని సాధిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ వ్యాఖ్యులు అపార్థాలకు దారితీస్తాయి. అప్రియమైన వార్త వింటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిస్థితులు చక్కబడతాయి. మాట నిలబెట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదాపడతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరే వరకు శ్రమించండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఆకస్మిక ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆప్తులు చేయూతనిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అందరితోను మితంగా సంభాషించండి.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో సతమతమవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కారక్రమాలు సాగవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. బెట్టింగ్లకు పాల్పడవద్దు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పువస్తుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతతారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కష్టమనుకున్న పనులు సానుకూలమవుతాయి. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. ఉల్లాసంగా గడుపుతారు. తీర్ధయాత్రకు సన్నాహాలు సాగిస్తారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఆత్యీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఏకాగ్రతతో శ్రమించండి. ఇతరులను తప్పుపట్టవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటం ముఖ్యం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. అనుమానాలకు తావివ్వవద్దు. ధైర్యంగా అడుగు ముందుకేయండి. పనులు మందకొడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితులను సంప్రదించండి. ఏకాగ్రతతో వాహనం నడపండి.