మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఓర్పుతో శ్రమించండి. ఫలితం ఆశించవద్దు. పట్టుదలే మీకు శ్రీరామరక్ష. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలు పట్టించుకోవద్దు. మనోధైర్యంతో ముందుకు సాగండి. రావలసిన ధనం సకాలంలో అందదు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. చెల్లింపుల్లో జాప్యం తగదు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. దంపతుల మధ్య చిరుకలహం. సర్దుకుపోయే ధోరణితో మెలగండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ధనప్రలోభాలకు గురికావద్దు. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. అవకాశం చేజారినా నిరుత్సాహపడవద్దు. సన్నిహితుల హితవు మీ పై పనిచేస్తుంది. ఆశావహదృక్పధంతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంతమేరకు పురోగమిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సోమవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం కదలికలను గమనిస్తూండాలి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరదు. ఇదీ ఒకందుకు మంచికే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. క్రమం తప్పకుండా ఔషధసేవనం పాటించండి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అనుకున్న కార్యం నెరవేరుతుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గురువారం నాడు చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. వేడుకకు హాజరవుతారు. కొత్తపరిచయాలేర్పడతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు విస్తరిస్తాయి. వ్యాపకాలు సృషించుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరతాయి. ఆప్తులకు ధనసహాయం చేస్తారు. కుటుంబ సౌఖ్యం, మానసిక ప్రశాంతత పొందుతారు. శుక్రవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. చేపట్టిన పనులపై దృష్టిసారించండి. సంతానం మొండితనం చికాకుపరుస్తుంది. అనునయంగా వారికి నచ్చచెప్పండి. ఆత్మీయులతో తరచు సంభాషిస్తారు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహనం అమర్చుకోవాలనే కోరిక తీరుతుంది. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దైవకార్యంలో పొల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అవకాశాలు కలిసివస్తాయి. అందరితో కలుపుగోలుగా మెలుగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. ఆదివారం నాడు ఏ పనీ చేయబుద్ధి కాదు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా తెలియజేయండి. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్ధితిగతులను క్షుణ్ణంగా తెలుసుకోండి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సవరించుకుంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు కొంతమేరకు మెరుగుపడతాయి. ఆర్ధికంగా కుదుటపడతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సన్నిహితులతో ఉల్లాసంగా గడపుతారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. మొండిగా ముందుకు దూసుకువెళతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానానికి శుభం జరుగుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహనిర్మాణం ముగింపు దశకు చేరుకుంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ప్రధానం.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. చిన్న విషయానికే చికాకుపడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. మీ వైఖరి కొందరికి మనస్తాపం కలిగిస్తుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సోమవారం నాడు ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. ఆశావహదృక్పథంతో యత్నాలు కొనసాగించండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. వీలైనంత వరకు ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయం నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు విపరీతం. ధనసమస్య ఎదురవుతుంది. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి అలక్ష్యం మీకు సమస్య అవుతుంది. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. మహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. సంతానానికి శుభపరిణామాలున్నాయి. కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులు ఓర్పు, అంకితభావం ప్రధానం.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రశంసలు, పురస్కారం అందుకుంటారు. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తారు. ఖర్చులు విపరీతం. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. మంగళవారం నాడు ఊహించని సంఘటన ఎదురవుతుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. గృహమార్పు కలిసివస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఉన్నధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు, ప్రణాలికలు ఆశించిన ఫలితాలిస్తాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం అన్ని విధాలా అనుకూలం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. వాయిదా పడుతూ వసున్న పనులు పూర్తికావస్తాయి. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లోనుకావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. సంతానానికి శుభం జరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలిగే సూచనలున్నాయి. గృహమార్పు కలిసివస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు స్థానచలనం. ప్రయాణం తలపెడతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. అవకాశాలను దక్కించుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. పనులు త్వరితగతిన సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. రశీదులు, ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఎదుటివారికి మీ సామర్ధ్యంపై గురికుదురుతుంది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీ నమ్మకం ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. శుక్రవారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక కోసం నిరీక్షణ తప్పదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండిగా యత్నాలు సాగిస్తారు. సంతానం కదలికలపై దృష్టిపెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. అధికారులకు హోదామార్పు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్య ఎదురవుతుంది. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు.