మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహబలం అనుకూలంగా ఉంది. పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోండి. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు చేపడతారు. దస్త్రం వేడుకకు ముహుర్తం ఖరారవుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉపాధిపథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమిస్తే మంచి ఫలితతాలుంటాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమర్ధతను చాటుకుంటారు. బంధుమిత్రులతో తరచు సంభాషిస్తుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వైద్యపరీక్షలు అవసరం. శనివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారాలు బాగుంటాయి. శుభకార్యానికి హాజరవుతారు. దూరప్రయాణం సజావుగా సాగుతుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. స్నేహసంబంధాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. శుక్రవారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. మీ నుంచి వివరాలు రాబట్టేందుకు కొందరు యత్నిస్తారు. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు. గృహనిర్మాణాలు పూర్తికావస్తాయి. శుభకార్యానికి సన్నాహలు సాగిస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. యత్నాలు విరమించుకోవద్దు. ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేయండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సోమవారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. చిన్న తప్పిదమే సమస్మాత్మకమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. నూతన వ్యాపారాలు చేపడతారు. శుభకార్యానికి హాజరవుతారు. పరస్సరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. రావలసిన ధనం సమయానికి అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. చిన్న విషయానికే చికాకుపడతారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. గృహనిర్మాణానికి ప్లాను ఆమోదమవుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. చిరువ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. మీ కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. నిదానంగా పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. పెద్దలను సంప్రదిస్తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాయగల్గుతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి అతిగా ఖర్చుచేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వం స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు, అజ్ఞాత వ్యక్తులు మోసం చేసే ఆస్కారం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ కొత్త బాధ్యతలు. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. విద్యార్థులు ఏకాగ్రతతో శ్రమిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. లక్ష్యం సాధిస్తారు. స్థిరచరాస్తి మూలక ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. బుధవారం నాడు కొత్త సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉందిమీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సౌమ్యంగా సంభాషించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు సదావకాశం లభిస్తుంది. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. పుణ్యకార్యంలో పాల్గొంటారు. వాహనదారులకు అత్యుత్సాహం తగదు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ ఓర్పునకు పరీక్షా సమయం. కార్యసాధనకు మరింత శ్రమించాలి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఎంత ఆదాయం వచ్చినా చేతిలో ధనం నిలవదు. దుబారా ఖర్చులు విపరీతం. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం మీలో ఉత్సాహం కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. రిటైర్డు అధికారులకు వీడ్కోలు పలుకుతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్ధికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. కష్టపడినా ఫలితం ఉండదు. ఆత్మీయుల హితవు ఉత్తేజపరుస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. సంతానానికి శుభఫలితాలున్నాయి. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. దూరపు బంధువుల ఆహ్వాం అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యపరీక్షలు అనివార్యం. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం యోగదాయకం. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పెద్దలతో సంద్రింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులతో తరచూ సంభాషిస్తుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదోన్నతి, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఏకాగ్రత, అంకితభావం ప్రధానం. వ్యాపారాలు ఊందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత.
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఏకపక్షంగా వ్యవహరించవదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. ఖర్చులు విపరీతం. శనివారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. దంపతుల మధ్య దాపరికం తగదు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. సంతానం పై చదువుల గురించి ఆలోచిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యం పస్థిరంగా ఉంటుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.