శుక్రవారం, 23 జనవరి 2026
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-12-2025 బుధవారం ఫలితాలు - నగదు స్వీకరణ.. చెల్లింపుల్లో జాగ్రత్త...

Karkatam
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. అవకాశం కలిసివస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రయాణం కలిసివస్తుంది.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణసమస్యల నుంచి విముక్తులవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులు చేపడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పందాలు, క్రీడా పోటీల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఖర్చులు విపరీతం. అందరితోను మితంగా సంభాషించండి. పనులు పురమాయించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆచితూచి అడుగేయండి. నోటీసులు అందుకుంటారు. నిపుణులను సంప్రదిస్తారు. స్థలవివాదం పరిష్కారమవుతుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. నిర్విరామంగా శ్రమిస్తారు. కష్టం ఫలిస్తుంది. లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పందాలు, క్రీడా పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధ్యం. మీ సామర్థంపై నమ్మకం పెంచుకోండి. స్వశక్తితోనే లక్ష్యం సాధిస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం గ్రహిస్తారు. ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ప్రయాణంలో కొత్తవ్యక్తులతో జాగ్రత్త. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి.. ఆర్భాటాకు విపరీతంగా ఖర్చుచేస్తారు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ సామర్థ్యంపై ధైర్యం కలుగుతుంది. ఆటంకాలెదురైనా ముందుకు సాగుతారు. చర్చల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలతో సతమతమవుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ఆచితూచి అడుగువేయండి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కలిసివచ్చే సమయం. ప్రతికూలతలను అధిగమిస్తారు. పెద్దల ఆశీస్సులుంటాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో శ్రమ అధికం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పర్మిట్ల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మాట నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన ఆశించిన పదవి దక్కదు. బాధ్మతల నుంచి తప్పుకుంటారు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ముందుచూపుతో వ్యవహరించండి. అనుకోని ఖర్చు చికాకు పరుస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.