సోమవారం, 8 డిశెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

08-12-2025 సోమవారం ఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

Rishabham
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురి కావద్దు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. పరిస్థితులు చక్కబడతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. అనవసర జోక్యం తగదు. 
 
మిథనం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. విలాసవస్తువులు కొనుగోలుచేస్తారు. పత్రాలు, రశీదలు జాగ్రత్త. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కొత్త పనులు మొదలెడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కారసిద్ధికి మరింత శ్రమించాలి. పట్టింపులకు పోవద్దు. లౌక్యంగా మెలగండి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. క్రీడా పోటీల్లో గెలుపొందుతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. గృహోపకరణాలు, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు పురమాయించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ప్రయాణం తలపెడతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. రుణవిముక్తులవుతారు. విలాసాలకు వ్యయం చేస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. పనులు ఒక పట్టాన సాగవు. వేడుకలో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. వేడుక తల పెడతారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. స్వయంకృషితోనే కార్యం సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది ఆపన్నులకు సాయం అందిస్తారు. పనులు పురమాయించవద్దు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఒత్తిడికి గురికావద్దు. అన్ని విధాలా మంచి జరుగుతుంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారానుకూలత ఉంది. తగిన నిర్ణయం తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఇంటివిషయాలు పట్టించుకుంటారు.