గురువారం, 4 డిశెంబరు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

astro8
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. లావాదేవీలు కొలిక్కివస్తాయి. నిర్దిష్ట ఆలోచనలతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలెదురవుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అనుకోని ఖర్చు ఎదురవుతుంది. పొదుపునకు అవకాశం చేజారిపోతుంది. పనుల్లో సాగక విసుగు చెందుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వాగ్వాదాలకు దిగవద్దు. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు వేసుకుంటారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
నేడు అనుకూలదాయకం. ధైర్యంగా యత్నాలు సాగించండి. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేయవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. సంప్రదింపులు సానుకూల ఫలితాలిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. చిన్న చిన్న చికాకులుంటాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నొప్పించవద్దు. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. దుబారా ఖర్చులు విపరీతం. పనుల ప్రారంభంలో అటంకాలెదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ నుంచి విషయాన్ని రాబట్టేందుకు కొంతమంది యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రయాణం తలపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ప్రముఖులకు చేరువవుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు సామాన్యం. పనులు మందకొడిగా సాగుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆరోగ్యం జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలు అధికం. అవకాశం చేజారిపోతుంది. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వాహనదారులకు దూకుడు తగదు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఆశించి భంగపడతారు. పరిచయస్తుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
విశేషమైన ఫలితాలున్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. అర్థాంతంగా ఆగిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తివుతాయి. ఆహ్వానం అందుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కృషి ఫలిస్తుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రముఖులతో పరిచయమేర్పడుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. సామరస్యంగా మెలగండి.