సంబంధిత వార్తలు
- దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...
- కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...
- భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది
- Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం
- AI : ఏఐ అమరత్వాన్ని సృష్టించదు.. 150 సంవత్సరాలు మనిషి జీవిస్తాడు..
భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?
కర్టెసీ: జెమినీ ఏఐ ఫోటో
ఇక అప్పట్నుంచి సోనీ తన పిల్లల్ని చదివించుకుంటూ జాగ్రత్తగా వుంటోంది. ఈ క్రమంలో ఆమెకి ఏదైనా అత్యవసరమైన పనులు కావాలంటే అదే ప్రాంతానికి చెందిన కైలాష్ అనే వ్యక్తిపైన ఆధారపడేది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కైలాష్‌కి కూడా వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భర్త లేని మహిళ సోనీకి సాయం చేస్తున్న కైలాష్ గురించి అతడి భార్య కూడా లైట్ గా తీసుకున్నది. దీనితో కైలాష్-సోనీ ఇద్దరూ వీలున్నప్పుడల్లా ఏకాంతంగా కలవడం చేస్తున్నారు. సోనీ మరొక వ్యక్తితో సంబంధాన్ని సాగించడాన్ని సోనీ భర్త తరపు వారు జీర్ణించుకోలేకపోయారు.
గత శుక్రవారం నాడు కైలాష్ ను కలిసేందుకు సోనీ ఏకాంతంగా వెళ్తుండగా ఆమెను అనసరించారు. సోనీ-కైలాష్ ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ ఓ స్తంభానికి కట్టేసి ఇద్దరిపై పెట్రోలు పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. మంటల ధాటికి కైలాష్-సోనీ ఆర్తనాదాలు చేస్తుండటంతో స్థానికులు పరుగులు పెడుతూ అక్కడికి వెళ్లారు. వారి కట్లు విప్పారు. కానీ అప్పటికే కైలాష్ 70 శాతం గాయాలు, సోనీ 90 శాతం గాయాలయ్యాయి. ఇద్దరూ చికిత్స పొందుతూ మరణించారు.
వారి మరణానికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. భర్త లేని ఆ మహిళకు ఆసరాగా నిలిచిన ఆ వ్యక్తి భార్యకు లేని బాధ వీళ్లకెందుకు అంటూ పలువురు స్థానికులు వాదనకు సైతం దిగారు. వారికి పోలీసులు సర్దిచెప్పి పంపించేసారు. నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
