గురువారం, 4 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : గురువారం, 4 డిశెంబరు 2025 (18:46 IST)

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

Korean Director met cine celebrites
Korean Director met cine celebrites
ఎక్స్‌ట్రార్డినరీ, అటార్నీ వూ తో పాటు అనేక విజయవంతమైన కొరియన్ డ్రామాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ కొరియన్ దర్శకుడు, నిర్మాత యూ ఇన్-సిక్, 2025 హైదరాబాద్ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా హైదరాబాద్‌ లో తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేస్తుకున్నారు.
 
డిసెంబర్ 1న, దర్శకుడు యూ హైదరాబాద్‌లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్‌కు నాయకత్వం వహించారు, అతని సృజనాత్మక , నిర్మాణ శైలి, తెరవెనుక అనుభవాల గురించి అరుదైన ఇన్ సైట్స్ అందించారు. ఈ సెషన్‌లో కె-డ్రామా అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
 
తర్వాత, డైరెక్టర్ యూ హైదరాబాద్‌లోని ది లీలాలో తెలంగాణ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలతో సమావేశమయ్యారు. అభివృద్ధి చెందుతున్న కంటెంట్ ల్యాండ్‌స్కేప్, సహకార నిర్మాణ అవకాశాలు, వినోద రంగంలో కొరియా-భారతదేశ  కొలాబరేషన్ బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు.
 
ఈ సమావేశంలో  దిల్ రాజు, డి. సురేష్ బాబు,  అల్లు అరవింద్, కె. ఎల్. నారాయణ, శ్రీ చిరంజీవి, శ్రీ నాగవంశి సూర్యదేవర, శ్రీ బన్నీ వాస్, శ్రీ ధీరజ్ మొగిలినేని, శ్రీ సుధాకర్ చెరుకూరి, శ్రీ శోభు యార్లగడ్డ, శ్రీ ఎస్.కె.ఎన్, శ్రీ రాజీవ్ రెడ్డి, శ్రీ ప్రశాంత్,నటుడు శ్రీ ఆనంద్ దేవరకొండ పాల్గొన్నారు.
 
దర్శకుడు యూ ఇన్-సిక్ విజిట్ కొరియా, భారతదేశం మధ్య లోతైన సాంస్కృతిక,  సినిమా సహకారాన్ని పెంపొందించడానికి, కంటెంట్ క్రియేషన్, క్రియేటివ్ ఎక్స్ చేంజ్,  భవిష్యత్తులో మరిన్ని భాగస్వామ్యాలకు  మార్గం సుగమం చేస్తుంది.