గురువారం, 4 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : గురువారం, 4 డిశెంబరు 2025 (18:28 IST)

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Kama and the Digital Sutras
Kama and the Digital Sutras
వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్. ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు బాపిరాజు. బుధవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.
 
డీవోపీ శివశంకర వరప్రసాద్ మాట్లాడుతూ - "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాకు డీవోపీగా వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాను రూపొందించారు. మాకున్న రిసోర్సెస్ లో విజువల్ గా మంచి క్వాలిటీ ఉండేలా సినిమా చేశాం అన్నారు.
 
నటుడు దినేష్ మాట్లాడుతూ - గతంలో ప్రసాద్ గారి దర్శకత్వంలో బంగారు పాదం సినిమాలో నటించాను. ఆయన డైరెక్షన్ లో నేను చేస్తున్న రెండో చిత్రమిది. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. నటుడిగా నాకు గుర్తింపు తీసుకొచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా డైరెక్టర్ ప్రసాద్ గారు అందరికీ నచ్చేలా రూపొందించారు అన్నారు.
 
నటి చంద్రకళా మాట్లాడుతూ - "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా స్క్రిప్ట్ చదివినప్పుడు ఈ మూవీ నేను చేయగలనా అని భయపడ్డాను. కానీ సినిమా ఇండస్ట్రీపై ప్యాషన్ తో వచ్చినప్పుడు అవకాశాలు ఎందుకు వదులుకోవాలి అని ఛాలెంజింగ్ గా తీసుకుని నటించాను. ఈ సినిమాలో మనందరం సొసైటీలో చూసే సోషల్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే ప్రేక్షకులు థియేటర్స్ లో కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది అన్నారు.
 
నటుడు జోగారావు మాట్లాడుతూ - ఇటీవలే నేను ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో నటించాను. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా కూడా నాకు నటుడిగా గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. చిన్న చిత్రాలను ఆదరించినప్పుడే మాలాంటి ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్స్ కు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుంది. ప్రేక్షకులు, మీడియా మిత్రులు మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.
 
నటుడు బుగత సత్యనారాయణ మాట్లాడుతూ - నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను కళ్లకు కట్టినట్లు మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఈ చిత్రంలో చూపించారు. ఆయన తన భుజాలపై ఈ సినిమాను వేసుకుని తెరకెక్కించారు. ఈ మధ్య చిన్న చిత్రాలే ఘన విజయాలు సాధిస్తున్నాయి. మా "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను కూడా మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.
 
దర్శక నిర్మాత ఎన్ హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ - నేను పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్స్ చేశాను. గతంలో బంగారు పాదం అనే చిత్రాన్ని రూపొందించాను. ఇప్పుడు "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నా. మాది బడ్జెట్ వైజ్ చిన్న సినిమా కానీ క్వాలిటీలో కాదు. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా రెండే ఉంటాయి. మా సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ గా మూవీ చేశాం. సెన్సార్ వాళ్ల దృష్టి చిన్న సినిమాకు ఒకలా, పెద్ద సినిమాకు ఒకలా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. నాకూ అలాంటి భావనే కలిగింది. మా చిత్రాన్ని పొయెటిక్ గా రూపొందించాం. కాళిదాసు మేఘదూతం, జయదేవుడి గీత గోవిందం...నుంచి కొన్ని కవిత్వాలు మా సినిమాలో ఉపయోగించాం. మా సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా, మంచి సినిమా చేశారు, క్వాలిటీ మూవీ చేశారనే పేరు మాత్రం తప్పకుండా వస్తుంది అన్నారు.
 
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ - మనం బయట సమాజంలోని మృగాళ్లను శిక్షిస్తున్నాం. కానీ మన కుటుంబాల్లో, ఇంటిలో ఉండే మృగాళ్లను శిక్షించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. ఇదే ఇతివృత్తంతో మంచి సందేశం, వినోదం ఉండేలా "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను రూపొందించారు ప్రసాద్ గారు. ఈ చిత్రాన్ని మా శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ నెల 12న థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. థియేట్రికల్ రిలీజ్ పరంగా సాధ్యమైనంత విస్తృతంగా ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అయ్యేలా చేస్తాం అన్నారు