గురువారం, 4 డిశెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 డిశెంబరు 2025 (19:13 IST)

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

laalo movie
ఓ గుజరాతీ చిత్రం సరికొత్త రికార్డులు నెలకొల్పింది. కేవలం 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం 54 రోజుల్లో ఏకంగా వంద కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ఎలాంటి అంచనాలు లేదా భారీ ప్రమోషన్లు లేకుండా ఈ చిత్రం విడుదలై, కేవలం మౌత్ టాక్‌తోనే సంచలనాల నమోదు చేసింది. ఆ చిత్రం పేరు "లాలో : కృష్ణ సదా సహాయతే". అంకిత సఖియా దర్శకత్వం వహించారు. సృహద్ గోస్వామి ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమానే ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. 
 
మానసి పరేఖ్ - పృథ్వీ గోహిల్ నిర్మించిన ఈ చిత్రం ఇపుడు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే, ఈ సినిమా కోసం కొన్ని కోట్లు ఖర్చు చేశారని అని భావిస్తే అది పొరపాటే అవుతుంది. కేవలం రూ.50 లక్షల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్స్ పెద్దగా లేకుండా, ఏ మాత్రం అంచనాలు లేకుండా గత అక్టోబరు 10వ తేదీన ఈ చిత్రం విడుదలైంది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఇపుడు ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈ రికార్డును దక్కించుకుంది. కంటెంట్ ఉంటే చాుల అనే మాటను మరోమారు ఈ చిన్న చిత్రం నిరూపించింది.