1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 జులై 2025 (16:58 IST)

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

harihara veeramallu
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి దర్శకుడు. శుక్రవారం విడుదలవుతోంది. అయితే, ఈ సినిమా ఆడ్వాన్స్ బుకింగ్స్ జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. ఈ సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.
 
నిజానికి పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు చేయలేదు. అదేసమయంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి చిత్రాలు చేశారు. ఇవన్నీ రీమేక్‌లు. అయినప్పటికీ కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించాయి. రూ.100 కోట్లను అవలీలగా దాటేశాయి.
 
ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు చిత్రం జూలై 24వ తేదీన విడుదలకానుంది.. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే వీరమల్లు వీర విహారం తప్పదని అంటున్నారు. పవన్ కెరియర్‌లోనే రికార్డు స్థాయి ఓపన్సింగ్స్ ఖాయమననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీరి మాటలు నిజమవుతాయో లేదో అని తెలియాల్సివుంది.