Raashi Khanna: ఉస్తాద్ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కి వస్తుండగా ఓజీ చిత్రంతో పాటు మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా కొనసాగుతుంది. ఈ సినిమాలో శ్రీలీల నాయిక. కాగా, మరో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా నటిస్తుంది. ఈమె ఈరోజే తమ యూనిట్ లోకి ఆహ్వానిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. దేవదూత రాశిఖన్నాను శ్లోకా గా ఎంట్రీ ఇస్తున్నట్లు కాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో షూటింగ్ జరుగుతోంది.
ఈ చిత్రానికి గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ గురించి పవన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. నేను ప్లాప్ లో వున్నప్పుడు నాకు హరీష్ గబ్బర్ సింగ్ తో హిట్ ఇచ్చాడు అన్నారు. ఇక దానికి సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా దేశభక్తి ఇమిడి వున్న కథతో ఉస్తాద్ భగత్‌సింగ్ రాబోతోంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా బోస్ ఉజ్వల్ కులకర్ణి పనిచేస్తున్నారు.