1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
  4. Things people with diabetes need to know

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Diabetes care
డయాబెటిస్. షుగర్ వ్యాధిని వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ వున్న పదార్థాలు తినడం, ప్రోబయోటిక్ తీసుకోవడం పెంచడం వంటి చర్యలను చేపట్టి కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము.
 
రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల సామర్థ్యం మెంతులుకి వుంది, వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
మదుమేహాన్ని వెల్లుల్లి కంట్రోల్ చేయడంలో మేలు చేస్తుంది కనుక దీనిని తీసుకుంటుండాలి.
ఉసిరి రక్తంలో గ్లూకోజ్ జీవక్రియను మెరుగుపరిచి చక్కెర స్థాయిలను తగ్గించగలదు.
రోజూ వేప ఆకులను నమిలి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి.
మధుమేహాన్ని కలబంద అడ్డుకుంటుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
షుగర్ వ్యాధిని అడ్డుకోవడంలో సాయపడే మరో చక్కని దినుసు దాల్చిన చెక్క.
టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించగల శక్తి కాకర కాయకు వుంది. 
తర్వాతి కథనం
Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..