బుధవారం, 26 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 నవంబరు 2025 (21:24 IST)

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

Varanasi
Varanasi
ఎస్.ఎస్. రాజమౌళి వారణాసి చిత్రం కొన్ని వారాలుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. మహేష్ బాబు పాత్ర చిన్ననాటి వెర్షన్‌ను జూనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ రామ్ పోషించనున్నాడని తెలుస్తోంది. 
 
భార్గవ్ ఈ పాత్రకు సరిపోతాడని.. అతనిలో మహేష్ బాబుతో స్వల్ప పోలికలు వుండటంతో ఈ పాత్రను భార్గవ్‌ని ఎంచుకున్నట్లు చిత్ర నిర్మాణ వర్గాల సమాచారం. మహేష్ వ్యక్తిగతంగా తారక్‌ని అడగడంతో.. అందుకు యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. వారణాసి రూ. 1,300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతోంది.
 
వారణాసిలో మహేష్ బాబు రుద్రుడు, రాముడు అనే ద్విపాత్రాభినయంలో నటిస్తున్నట్లు చెబుతున్నారు. రుద్ర చిన్ననాటి పాత్రలో భార్గవ రామ్ కనిపిస్తారని తెలుస్తోంది.