బుధవారం, 26 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 నవంబరు 2025 (18:57 IST)

చొరబాటుదారులు కేన్సర్ రోగులు వంటివారు : కంగనా రనౌత్

Kangana Ranaut
భారతీయ జనతా పార్టీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చొరబాటుదారులపై మండిపడ్డారు. వారిని కేన్సర్ రోగులతో సమానంగా పోల్చారు. ఇలాంటి వారిని తక్షణం దేశం నుంచి బహిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది బీజేపీ, ఎన్నికల సంఘం పన్నిన కుట్రగా అభివర్ణించారు. భారత ఎన్నిక సంఘం భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంఘంగా మారిపోయిందంటూ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
 
ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ మండిపడ్డారు. చొరబాటుదారులను క్యాన్సర్‌తో పోల్చారు. వారిని దేశం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. 'ఇటువంటి బెదిరింపులకు దేశం భయపడదు. చొరబాటుదారులను తొలగించాలని అందరూ కోరుకుంటున్నారు. వీరంతా శరీరంలో క్యాన్సర్ లాంటివారు. వారిని సాగనంపాల్సిందే' అని కంగనా రనౌత్ అన్నారు. 
 
అయోధ్య రామాలయం ధ్వజారోహణ కార్యక్రమంపై పాకిస్థాన్‌ విదేశాంగశాఖ చేసిన ప్రకటనపైనా మండిపడ్డారు. 'రోజురోజుకూ పరిస్థితులు దిగజారుతుండటంతో పాకిస్థాన్ భయపడుతోంది. ఆ దేశం ఓ భిక్షాటన పాత్రగా మారింది. భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలో మరింత ముందుకెళ్లనుంది' అని పేర్కొన్నారు.