బుధవారం, 26 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 26 నవంబరు 2025 (19:13 IST)

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Anupama Parameswaran -  The Pet Detective
Anupama Parameswaran - The Pet Detective
ఇండియాలో వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ 5 ఎప్పటిప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూనే ఉంది. తాజాగా మ‌రో డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌వుతోంది. అదే ‘ది పెట్ డిటెక్టివ్‌’. న‌వంబ‌ర్ 28 నుంచి జీ 5లో మ‌ల‌యాళం, తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్ర‌ణీష్ విజ‌య‌న్ దీన్ని తెర‌కెక్కించారు. ష్రాఫ్ యు దీన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించటంతో పాటు నిర్మాతగానూ తొలి అడుగు వేశారు. ఇంకా ఈ చిత్రంలో వినాయ‌క‌న్‌, విన‌య్ ఫార్ట్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, శ్యామ్ మోహ‌న్, జ్యోమ‌న్ జ్యోతిర్ ఇత‌క పాత్ర‌ల్లో న‌టించారు.
 
 
ఈ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే జోస్ అలులా (ష్రాఫ్ యు దీన్‌) ఓ డిటెక్టివ్‌. అత‌నికి చెప్పుకోద‌గ్గ‌క కేసులుండ‌వు. అయితే త‌నను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌నిపించ‌కుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయ‌టానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్ర‌మంలో ఏర్ప‌డ్డ గంద‌ర గోళ ప‌రిస్థితుల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ స్మ‌గ్ల‌ర్స్‌, కిడ్నాప‌ర్స్‌, క‌నిపించ‌కుండా పోయిన ఓ చిన్నారి, మెక్సిక‌న్ మాఫియా డాన్, అరుదైన చేప‌, క‌నిపించ‌కుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్సెపెక్ట‌ర్ అంద‌రూ ఈ క‌థ‌లోకి ఎంట్రీ ఇస్తారు.  
 
క‌థ‌లోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మ‌లుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్‌.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌, కామెడీ మూవీ ల‌వ‌ర్స్ స‌హా అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌, న‌టుడు ష్రాఫ్ యు దీన్ మాట్లాడుతూ ‘‘ది పెట్ డిటెక్టివ్‌’ సినిమా నాకెంతో ప్రత్యేకం. న‌టుడిగానే కాదు.. నిర్మాత‌గా ఇది నా తొలి చిత్రం. ప్రేక్ష‌కులు ఏదో ఎక్కువ‌గా ఆలోచన చేయ‌కుండా స‌ర‌దాగా, హృద‌య‌పూర్వ‌కంగా న‌వ్వుకునేలా ఓ సినిమా చేయాల‌ని భావించి చేశాం. ఇప్పుడు ఈ సినిమాకు జీ 5లో మ‌ల‌యాళంలో వ‌స్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, హిందీ వెరన్స్‌లోనూ ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి రావ‌టం ఆనందంగా ఉంది’ అన్నారు.