గురువారం, 23 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2025 (11:58 IST)

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Dhruv Vikram, Anupama Parameswaran and team
Dhruv Vikram, Anupama Parameswaran and team
ధృవ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరణ్ జంటగా పా. రంజిత్ సమర్పణలో సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితి ఆనంద్ నిర్మాతలుగా మారి సెల్వరాజ్ తెరకెక్కించిన చిత్రం బైసన్.  ఈ సినిమాకి నివాస్ కె. ప్రసన్న సంగీతాన్ని అందించారు. ఇక ఈ మూవీని తెలుగులో జగదంబే ఫిల్మ్స్ బ్యానర్ మీద తెలుగులో అక్టోబర్ 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రం గురించి పలు విషయాలు తెలియజేశారు.
 
హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ, నేను కొన్ని రోజుల క్రితం ఇక్కడికి షాపింగ్ చేసేందుకు వచ్చాను. అక్కడ ఆ షాప్ ఓనర్ నన్ను చూసి మీరు విక్రమ్‌లా ఉన్నారు.. అని అన్నారు. అవును.. నేను ఆయన కొడుకుని అని చెప్పాను. మా నాన్న గారి కష్టం, సినిమా కోసం చేసే ప్రయోగాల గురించి చాలా చెప్పారు. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. కానీ నేను ఆయన కొడుకుగా నాకు అన్నీ సులభంగానే అందాయి. కానీ ఆయనలా అందరి ప్రేమను సంపాదించేందుకు చాలా కష్టపడతాను. 
 
నాకు తెలుగులో నటించాలని ఉంది. బైసన్ కోసం మూడేళ్లు కష్టపడ్డాను. ఈ మూవీని చూడండి. నచ్చితే సపోర్ట్ చేయండి. నాన్న గారిలానే నేను కూడా చాలా కష్టపడి వంద శాతం ఎఫర్ట్ పెడతాను. నా కొడుకు కూడా ఇలా వస్తే.. మీ నాన్న ధృవ్ అంటే చాలా ఇష్టం అని చెప్పే స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. తమిళంలో మా సినిమాకు మంచి ఆదరణ దక్కింది. మారి సెల్వరాజ్ గారు తన జీవితంలో ఎదురైన అనుభవాలు, చూసిన సంఘటనల నుంచే కథల్ని రాసుకుంటారు. పీపుల్స్‌ని ఎడ్యుకేట్ చేయాలని ఆయన పరితపిస్తుంటారు. అర్జున అవార్డు గ్రహీత మణతి గణేషన్ కథ ఆధారంగా ఈ మూవీని మారి సెల్వరాజ్ గారు తెరకెక్కించారు. ఈ మూవీ కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను. నంబర్స్ గురించి కాకుండా తెలుగులో మా సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ మా చిత్రం నచ్చుతుంది అని అన్నారు.
 
అనుపమ పరమేశ్వరణ్ మాట్లాడుతూ .. మారి సెల్వరాజ్ గారి మొదటి చిత్రంలో నేను నటించాల్సింది. కానీ అప్పుడు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఆయన తీసిన ‘బైసన్’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీతో నేను చాలా నేర్చుకున్నాను. తమిళంలో ఆల్రెడీ ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. తెలుగులో రిలీజ్ చేయాలనే డిమాండ్ కూడా ఎక్కువైంది. మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న జగదంబే బాలాజీ గారికి థాంక్స్. తెలుగులో రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలి’ అని అన్నారు.
 
 నిర్మాత వీపీ సెల్వన్ బాలాజీ మాట్లాడుతూ .. మాకు ఈ మూవీని ఇచ్చిన నీలం స్టూడియోస్, దీపక్, పా రంజిత్ గార్లకు థాంక్స్. ధృవ్ ఎంత కష్టపడ్డాడు అన్నది సినిమా చూస్తే అర్థం అవుతుంది. అనుపమ గారి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. తమిళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు తెలుగులో అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.