గురువారం, 6 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 10 సెప్టెంబరు 2025 (18:13 IST)

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas
Bellamkonda Sai Srinivas
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
ఫస్ట్ టై హారర్ సినిమా చేయడం ఎలా అనిపించింది?
-నేను ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఆ క్రమంలో చాలా వరకూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే నాకు పర్సనల్ గా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చాలా ఇష్టం.
 
-డైరెక్టర్ కౌశిక్ కలిసినప్పుడు కూడా మేము ఇదే మాట్లాడుకున్నాం. అప్పుడు కిష్కింధపురి కథ చెప్పారు. చాలా నచ్చింది. నిజంగా నాకు బాగా ఇష్టమైన జానర్ ఇది. ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని చేసాం.  
 
-నిన్న ఫస్ట్ టైం థియేటర్స్ లో చూసాం. సినిమా అదిరిపోయింది. ముఖ్యంగా  సౌండ్. సలార్ యానిమల్ కాంతారా సినిమాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్ రాధాకృష్ణ గారు సౌండ్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈ సినిమాకి అద్భుతమైన సౌండ్ డిజైన్ చేసే స్పేస్ ఉంది. హారర్ మిస్టరీ ఉన్న ఒక కొత్త జానర్ ఇది. టెక్నికల్ అద్భుతంగా ప్రజెంట్ చేశాం.
 
- థ్రిల్లర్ జానర్ లో చేసిన రాక్షసుడుకి చాలా మంచి అప్లోజ్ వచ్చింది. మహిళ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకి గొప్ప ఆదరణ లభించింది.
 
-చాలా రోజుల తర్వాత  కిష్కింధపురి తో ఒక స్ట్రైట్ ఫిల్మ్ చేసే అవకాశం దొరికింది. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఖచ్చితంగా కిష్కింధపురి' ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ థ్రిల్, సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.
 
- విషయం ఏమంటే. మీరు నమ్మకపోవచ్చుకానీ, అన్నీ రియల్ లొకేషన్లలో షూట్ చేశాం. అందులో భాగంగా పురాతన బంగ్లా కోసం వెతుకుతుంటే, ముంతాజ్ హౌస్ గురించి విన్నాం. అక్కడ షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా వుంది. ఎందుకని ఇలా వదిలేశారని మేనేజర్ ను అడిగితే.. అతను, సార్. ఇక్కడ మూడో ఫ్లోర్ లో గతంలో ముగ్గురు పైనుంచి దూకి చనిపోయారంటూ చెప్పాడు. నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది. అయితే వెంటనే..అసలు ఇది కదా మాకు కథకు కావాల్సిన లొకేషన్ అని అన్నాం. 
 
ఆ తర్వాత అక్కడ షూట్ చేస్తున్నప్పడు కెమెరా సెట్ చేసి సీన్ చేస్తుండగా మోనిటర్ లో పైన ముగ్గురు కనిపించారు. ఇది ఫీల్డ్ ఎవరక్కడా వారిని పక్కకు జరగమని చెప్పాం. జరగకపోవడంతో.. సెట్ టీమ్ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు సార్. అన్నాడు. ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నారే అని నేను, దర్శకుడు షాక్ కు గురయినా వెంటనే తేరుకుని మేనేజర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.
 
అయితే ఆ సీన్ లో వారు అలానే కనిపించారు. దానిని టెక్నికల్ గా తర్వాత తీసేశాం. ఇలా థ్రిల్ కలిగించే విషయాలు షూటింగ్ లు జరిగాయి.  ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా ఉంది. సినిమాని ఇలా కూడా తీయొచ్చా అనిపించేలా చేసిన సినిమా ఇది.
 
  -ఈ సినిమా కథలోనే యాక్షన్ ఉంది. మొత్తం ఆర్గానిక్ గా చేసిన సినిమా ఇది. విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ పరంగా ఆడియన్స్ చాలా థ్రిల్ అవుతారు.
 
- నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. మా ప్రొడక్షన్ లో చేసిన కాంచన లాంటి సినిమాలు చాలా ఎంజాయ్ చేశాను. టీనేజ్ లో ఉన్నప్పుడు కూడా హారర్ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాని టీనేజ్ ఆడియన్స్  కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. హారర్ కారణంగా సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇంత సీరియస్ హారర్ సినిమా చూసి చాలా కాలం అయిందని సెన్సార్ సభ్యులు చెప్పడం ఆనందాన్నిచ్చింది.
 
ఈ సినిమా కోసం ఒక వింటేజ్ రేడియో సెట్ వేశారు కదా?
- ఈ సినిమా కోసం సువర్ణమాయ రేడియో స్టేషన్ ని సెట్ గా వేశాం. అలాగే రియల్ వాంటెడ్ హౌస్ లో షూట్ చేశాం. అది రియల్ గా పాతబడిపోయిన బిల్డింగు. తర్వాత వాళ్లకి కొత్త బిల్డింగ్ వేసి ఇవ్వడం జరిగింది.  
 
కొత్త సినిమాలు గురించి?
టైసన్ నాయుడు షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. హైందవ షూటింగ్ చివరి దశకు వచ్చింది. సమ్మె కారణంగా బ్రేక్ పడింది కానీ ఈపాటికి షూటింగ్ అయిపోయేది. ఈ రెండు కూడా డిఫరెంట్ సినిమాలు. అలాగే పొలిమేర డైరెక్టర్ అనిల్ తో ఒక సినిమా ఉండబోతుంది. అది న్యూ ఏజ్ థ్రిల్లర్.