మంగళవారం, 22 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 21 జులై 2025 (20:10 IST)

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

Heart Attack
ఇటీవలి కాలంలో కర్నాటక రాష్ట్రంలో గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వారానికి నాలుగైదు కేసులు నమోదవుతున్నాయి. శనివారం నాడు 32 ఏళ్ల యోగా టీచర్ ఉన్నఫళంగా ముందుకు పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కర్నాటక లోని బెలగావి జిల్లాలో చిక్కాడి ప్రాంతంలో ఆరతి దిలీప్ అనే 32 ఏళ్ల యోగా టీచర్ వుంటోంది. ఆమె శనివారం నాడు వున్నట్లుండి కిందిపడిపోయి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యలు తేల్చారు. ఇటువంటి ఘటనే చింతామణి తాలూకలో జరిగింది. 48 ఏళ్ల టీచర్ క్లాసులో పాఠాలు చెబుతూ వుండగానే గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు.