Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?
ప్రియుడితో కలిసి భర్తను చంపిన సోనమ్ రఘువంశీ జైలులో ఏం చేస్తుందనే దానిపై ప్రస్తుతం రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆమెకు జైలులో ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ జైలు జీవితం ప్రారంభించి నెల రోజులైంది.
ఈ నేపథ్యంలో ఆమె ప్రతిరోజూ జైలు నియమావళిని పాటిస్తోంది. ఇతర మహిళా ఖైదీలతో కూడా ఆమె బాగా కలిసిపోయిందని సమాచారం. అయితే, ఆమె తన భర్త హత్య గురించి గానీ, తన వ్యక్తిగత జీవితం గురించి గానీ ఏ ఖైదీతో లేదా జైలు సిబ్బందితో మాట్లాడటం లేదు. జైలులో ఆమెకు ఇంకా ఎలాంటి పని అప్పగించలేదు.
అయితే, ఆమెకు టైలరింగ్, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన ఇతర పనులు నేర్పించనున్నట్లు సమాచారం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జైలు నిబంధనల ప్రకారం సోనమ్ తన కుటుంబ సభ్యులను కలవడానికి అవకాశం ఉంది. ఆమె ఇప్పటివరకు ఎవరినీ కలవలేదు. ఆమె ఫ్యామిలీ కూడా సోనామ్‌ని కలవడానికి జైలుకు రాలేదు. కనీసం వారికి ఫోన్ కూడా చేయలేదని తెలుస్తోంది. భర్తను చంపిన సోనమ్‌ను సొంత కుటుంబం కూడా ఒంటరిని చేసింది.
అలాగే పోలీసులు జరిపిన దర్యాప్తులో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోనమ్‌కు సంజయ్ వర్మ అనే వ్యక్తితో సంబంధం ఉందని, హత్యకు ముందు అతనితో వందల సార్లు ఫోన్‌లో మాట్లాడిందని పోలీసులు గుర్తించారు.అలాగే, హత్య జరిగిన తర్వాత సోనమ్ బుర్ఖా ధరించి సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి, ఎక్కడా ఆగకుండా పుట్టింటికి చేరుకుందని విచారణలో తేలింది.