జైపూర్: బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ జైపూర్లో వేగం పుంజుకుంది, మోటార్ క్రీడ, ఫ్యాషన్ యొక్క ఉన్నతమైన స్థాయి యొక్క కూడలిగా మారింది. పరిమితిని అధిగమించి, జైపూర్ ఎడిషన్ మోటార్ క్రీడలచే ప్రేరేపించబడిన డిజైన్, అందమైన పెర్ఫార్మెన్స్ వేర్, మరియు ఉత్సాహవంతమైన ఫ్యాషన్ ప్రదర్శనను అన్వేషించింది. ఇవి ఫ్యాషన్ యొక్క తదుపరి ధోరణిగా గుర్తించబడ్డాయి- వేగం మరియు ఖచ్చితత్వంతో ముందుకు దూసుకుపోయాయి.
ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(FDCI), సహకారంతో, స్టైల్ మరియు పవర్లు యొక్క అత్యంత వేగవంతమైన సర్క్యూట్ లోకి షోకేస్ రన్ వేని పునః ఊహించింది. ప్రముఖ డిజైనర్లు నమ్రత జోషిపుర, అభిషేక్ పాట్నిలు అత్యంత ఉత్సాహవంతమైన మోటార్ కోర్ సౌందర్యాన్ని పునః వ్యాఖ్యానించారు, రేసింగ్ సంస్కృతిని స్టేట్మెంట్‌ను చేసే ఫ్యాషన్‌గా మార్చారు. బాలీవుడ్ స్టార్ హర్నాజ్ సంధు రన్ వేని ఫినాలే షోస్టాపర్‌గా ఆధిపత్యంవహించారు, అందం మరియు వేగాల మిశ్రమాలను కలిగి ఉన్నారు, ర్యాప్ సెన్సేషన్ రఫ్తార్ షో యొక్క సంచలనమైన ఉత్సాహంతో జత కలిసిన ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్‌తో ఆ నైట్‌ను పూర్తి చేసారు. వేదికను లీనమయ్యే మోటార్ స్పోర్ట్ రంగంగా మార్చిన త్రీ-ల్యాప్ రన్ వే అనుభవంతో షో ప్రారంభమైంది. ద స్టార్ట్ లైన్ రేసింగ్ సిల్హౌటీ నుండి ద పిట్ లేన్ క్రోమ్ చే ప్రోత్సహించబడిన నాజూకైన, వ్యూహాత్మకమైన రూపం, అందమైన నైట్ యొక్క అత్యంత ఉత్సాహవంతమైన సౌందర్యం వరకు, ఉల్లాసభరితమైన స్పోర్ట్ కార్స్ స్టంట్లతో ముగిసింది. ఇది పూర్తి షోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ అనుభవం భారతదేశం యొక్క సాంస్కృతిక, సృజనాత్మక అభిరుచిని విస్తృతం చేసింది- వేగవంతమైనది, చురుకైనది మరియు తిరుగులేనిది, మరియు బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్‌ను సాటిలేని వేగంతో ఫ్యాషన్‌ను ముందుకు నడిపించే ఇంజన్‌గా నిలిపింది. దేబాశ్రీ దాస్ గుప్తా, CMO, పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఇలా అన్నారు, ఫ్యాషన్ మరియు సాంస్కృతిక సంభాషణలను తీర్చిదిద్దడంలో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఎల్లప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. టూర్ యొక్క జైపూర్ ఎడిషన్ ఆ కలను అత్యంత ఉత్సాహవంతమైన మోటార్ క్రీడ, అందమైన గొప్ప-ఫ్యాషన్లను సమ్మేళనపరచడం ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్లింది, సాహసం, స్టైల్ మరియు ఆవిష్కరణలను సంబరం చేసే లీనమయ్యే అనుభవాన్ని సృష్టించింది.
డిజైనర్ అభిషేక్ పట్ని ఇలా అన్నారు, సృజనాత్మకత యొక్క సరిహద్దులను అధిగమించడం ద్వారా బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఎల్లప్పుడూ విజేతగా నిలుస్తుంది. ఈ సహకారంతో, కలిసికట్టుగా మేము ఫ్యాషన్‌ను కొత్త వేగంలోకి మార్చాము, ఫ్యాషన్ తదుపరి ఎటువైపు వెళ్తుందో క్లుప్తంగా చూపించడానికి వైగాన్ని శైలితో కలిపారు. డిజైనర్ నమ్రత జోషిపుర ఇలా అన్నారు, అత్యంత ఉత్సాహవంతమైన కొటియర్‌ను విలక్షణమైన, వ్యక్తిగత- అభిరుచి రంగంలోకి తీసుకురావడానికి ఫ్యాషన్ బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ నన్ను ప్రేరేపించింది. మేము ఉమ్మడిగా ఫ్యాషన్ యొక్క తదుపరి అభివృద్ధిని నిర్వచించాము, ఇది మోటార్ క్రీడల ఖచ్చితత్వాన్ని హాట్-కౌచర్ యొక్క ఆకర్షణీయమైన ప్రపంచంలోకి తీసుకువస్తుంది.
షోకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన హర్నాజ్ సంధు ఇలా అన్నారు, జైపూర్లో బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ కోసం రన్ వేని ఉపయోగించడం రేస్ ట్రాక్ పైకి అడుగు పెట్టిన భావన కలిగిస్తోంది. స్వచ్ఛమైన ఉల్లాసం మరియు ఆత్మవిశ్వాసం బోల్డ్-నిర్భయమైన ఫ్యాషన్‌ను సమర్థించే ప్రదర్శనను వాస్తవికంగా తీసుకువస్తుంది. ర్యాపర్ రఫ్తర్ ఇలా అన్నారు, బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఫ్యాషన్‌ను ఒక పూర్తి కొత్త ట్రాక్ లోకి తీసుకువెళ్లింది, ఫ్యాషన్ వేగం, శక్తి మరియు ధోరణితో ముందుకు తీసుకువెళ్తుంది.
సునీల్ సేథీ, ఛైర్మన్, ఎఫ్ డిసిఐ, ఇలా అన్నారు, బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్‌తో కలిసి పని చేయడానికి ఎఫ్ డిసిఐ ఆనందిస్తోంది. ఇది ఫ్యాషన్ యొక్క రెండు శక్తివంతమైన కేంద్రాలను కలిపి తన భవిష్యత్తును రూపొందిస్తుంది. జైపూర్ ఎడిషన్ సృజనాత్మకత, సంస్కృతిని సంబరం చేస్తుంది మరియు భారతదేశపు ఫ్యాషన్లో తదుపరి రాబోయే ధోరణి కోసం వేగాన్ని నిర్దేశిస్తుంది. టూర్ ఇప్పుడు కొలకత్తాకు వెళ్తోంది. ఇక్కడ డిజైనర్లు అనామిక ఖన్నా డిసెంబర్ 20న సమకాలీన కోణంలో పనితనం ప్రదర్శిస్తారు, షోకు ప్రధాన ఆకర్షణగా ఇషాన్ ఖట్టర్ ఆధిపత్యం వహిస్తారు.