శుక్రవారం, 15 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 జులై 2025 (10:50 IST)

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

krishn jagarlamudi
హీరో పవన్ కళ్యాణ్‌పై సినీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నిత్యం మండే స్ఫూర్తి అంటూ కితాబిచ్చారు. "హరిహర వీరమల్లు" చిత్రానికి ఆయనే ఆత్మ, వెన్నెముక అని అన్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ నెల 24వ తేదీన విడుదలకానుంది. ఇది పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ. మొత్తం ఐదు భాషల్లో నిర్మించారు. 
 
ముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా షూటింగ్‌ను 50 శాతం పూర్తి చేయగా, మిగిలిన భాగాన్ని ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. మరో రెండు విడుదలకానున్న నేపథ్యంలో చిత్రం క్రిష్ జాగర్లమూడి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 
 
'హరిహర వీరమల్లు' సరికొత్త ప్రపంచంలోని అడుగుపెట్టే సమయం ఆసన్నమైందన్నారు. నిశ్శబ్దంగా కాదు.. ఒక బలమైన సంకల్పంతో రాబోతోందని చెప్పారు. సినిమాలోనే కాదు.. ఆత్మలోనూ పవన్ కళ్యాణ్ ఒక అసాధారణమైన శక్తి అని కొనియాడారు. ఆయన నిత్యం మండే స్ఫూర్తి అని అన్నారు. ఈ సినిమాకు ఆయనే ఆత్మ వెన్నెముక అని చెప్పారు. 
 
నిర్మాత ఏఎం రత్నం ఒక గొప్ప శిల్పి అని, ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా తట్టుకోగల ధైర్యం ఉన్ వ్యక్తి అని ప్రశంసించారు. ఆయన గొప్ప సంకల్పం అందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. వ్యక్తిగతంగా ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైనమన్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని చెప్పారు.