శనివారం, 16 ఆగస్టు 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 ఆగస్టు 2025 (15:21 IST)

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Tomato
టమోటాలు రుచికరంగా ఉంటాయి. అలాగే ఇవి జీర్ణక్రియకు బాగా ఉపయోగపడుతాయి. ఉదరానికి సంబంధించిన రోగాలుంటే టమోటాలు దివ్యౌషధంలా పనిచేస్తుంది. త్రేన్పులు, కడుపు ఉబ్బరంగా ఉండటం, నోట్లో పొక్కులు రావడంలాంటివి ఉంటే టమోటా సూప్ తయారు చేసుకుని అల్లం, నల్ల ఉప్పు కలుపుకుని సేవించండి. దీంతో ఉపశమనం కలుగుతుంది.
 
టమోటా సూప్‌ను సేవిస్తుంటే శరీరంలో కొత్త శక్తి పుట్టుకొస్తుంది. కడుపు తేలికగా ఉంటుంది. టమోటా సూప్ సేవిస్తే జలుబు సంబంధిత వ్యాధులు దరిచేరవు. రక్తలేమితో బాధపడేవారు నిత్యం టమోటాలు తింటుంటే మంచి ఫలితాలుంటాయి. మధుమేహం వ్యాధితో బాధపడేవారు సరిపడ మోతాదులో టమోటాలు తింటే మేలు చేస్తాయి.