ప్రియుడితో బ్రేకప్ తీసుకోవాలి.. సెలవు మంజూరు చేయండి..
తన ప్రియురాలితో బ్రేకప్ అయిందని, దీంతో తాను పనిపై మనస్సుపెట్టలేకపోతున్నానని అందువల్ల తనకు సెలవు మంజూరు చేయాలంటూ ఓ ఉద్యోగి తాను పని చేసే కంపెనీ సీఈవోకు ఈమెయిల్ లీవ్ లెటర్ పంపించాడు. దీన్ని చూసిన కంపెనీ సీఈవో ఆశ్చర్యపోయాడు. స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, "తన వృత్తి జీవితంలో అందుకున్న అత్యంత నిజాయితీగల సెలవు దరఖాస్తు ఇదే" అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ పోస్టు కాస్త వైరల్‌గా మారింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాన్ డేటింగ్ అనే సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి తనకు బ్రేకప్ అయిందని, ఆ బాధలో పనిపై శ్రద్ధ చూపెట్టలేకపోతున్నానని మెయిల్ చేశాడు. తనకు కొన్ని రోజులు సెలవు కావాలని కోరాడు. దీనిపై కంపెనీ సీఈవో జస్వీర్ సింగ్ స్పందిస్తూ, జెన్ జెడ్ తరం ఉద్యోగులు తన మనసులో ఏమీ దాచుకోరంటూ మెచ్చుకున్నారు. తమ భావోద్వేగాలు, మానసిక సమస్యలు వంటి అన్ని విషయాలను బహిరంగంగా షేర్ చేసుకుంటారు అని పేర్కొన్నారు.