గురువారం, 30 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 అక్టోబరు 2025 (18:55 IST)

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Chiranjeevi'
మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా కష్టాలు తప్పడం లేదు. దీంతో ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను లక్ష్యంగా చేసుకుని ఓ నెటిజన్ అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ నెటిజన్ దయా చౌదరి పేరుతో ఎక్స్ వేదికగా ఈ పోస్టులు పెడుతున్నట్టు చిరంజీవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
తన పేరు, ఫోటో, వాయిస్‌ను ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా, ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారీతిన అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి నెజన్లలో ఒకరు దయాచౌదరి ఇష్టారీతిలో పోస్టులు పెడుతున్నట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కొన్ని వెబ్‌సైట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ చిరంజీవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృత్రిమ మేథ సాంకేతికతను ఉపయోగించి తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలను సృష్టిస్తున్నాని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.