Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !
ప్రభాస్, రానా, అనుష్క కాంబినేషన్ లో రూపొందని బాహుబలి రెండు భాగాలను కలిపి ఒకే భాగంగా రాజమౌళి రీరిలీజ్ చేయడం తెలిసిందే. ఈనెల 31న విడుదలకాబోతున్న ఈ సినిమా గురించి హీరోలు, దర్శకుడు చిన్న ఇంటర్వ్యూ విడుదల చేశారు. అప్పట్లో తాము పడ్డ కష్టాలను ఇతరత్రా విషయాలను చిట్ చాట్ గా మాట్లాడుకున్నారు.
దీని కోసం గత అయిదారు నెలలుగా ఈ సినిమా కోసం వర్క్ చేసినట్లు రాజమౌళి చెప్పారు. అందులో ఏ సీన్ లు తీయాలి. యాక్షన్ సీన్ నిడివి తగ్గించాలి. అనేవి ప్రధానంగా ముందుకు వచ్చాయి. కథ చెడిపోకుండా చూపించాలనేది ముగ్గురి ప్లాన్. అసలు ఈ సినిమాను మొదట ఒకే భాగంగా తీసినా రాజమౌళి అంటే నిడివి ఎక్కువ తీస్తాడనీ, వేస్టేజ్ వుంటుందని అందరికీ తెలిసిందే. దానిని తెలివిగా రెండు భాగాలుగా అప్పటిలో ఓ కొత్తప్రయోగం చేశాడు.
రాజమౌళి వాటి గురించి చెబుతూ, రెండు సినిమాలు కలిపి రోలింగ్ టైటిల్స్ తీసేస్తే 5 గంటల 27 నిముషాలు సినిమా మొత్తం. ఇప్పుడు ఫైనల్ అవుట్ పుట్ 3 గంటల 43 నిముషాలు వచ్చింది. సినిమాలో అవంతిక లవ్ స్టోరీ ట్రాక్, పచ్చబొట్టేసిన సాంగ్, కన్నా నిదురించారా సాంగ్, ఇరుక్కుపో సాంగ్ కట్ చేశాను. యుద్ధ సన్నివేశాల్లో కొన్ని సీన్స్ కట్ చేశాను. కేవలం డైరెక్ట్ కథ మాత్రమే చెప్పేలా సినిమా ఎడిట్ చేశాను అన్నారు. మరి ఇప్పటికే బుల్లితెరపైన కూడా పలుదఫాలుగా చూసిన ఈ సినిమా ఏమేరకు ఆదరణ పొందుతుందో చూడాలి.
ఇక్కడ ట్విస్ట్ ఏమంటే. ఈ ఫార్మెట్ సక్సెస్ అయితే రెండు భాగాలుగా వున్న కొన్ని సినిమాలు ఒకే భాగంగా రిరిలీజ్ చేయడానికి రాజమౌళి బాట వేస్తున్నారనే టాక్ కూడా ఇండస్ట్రీలో నెలకొంది.