మంగళవారం, 28 అక్టోబరు 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2025 (17:53 IST)

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

Beetroot juice
Beetroot juice
బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే మహిళలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పోషకాల గని అయిన బీట్ రూట్‌ను ప్రతి రోజూ అర కప్పు తీసుకుంటే మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీట్ రూట్‌లో విటమిన్లు, యాంటీ-యాక్సడెంట్లు వంటి పోషకాలు వున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా ప్రతి రోజూ పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.. 
 
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా వుంటుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలను దూరం చేసుకోవాలంటే.. రోజూ బీట్ రూట్ జ్యూస్ తీసుకోవాల్సిందే అంటున్నారు న్యూట్రీషియన్లు. అలాగే పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా శరీర బరువు తగ్గుతుంది. కొవ్వు కరిగిపోతుంది. కెలోరీలను బీట్ రూట్ రసం బర్న్ చేస్తుంది. తద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. 
 
ఇకపోతే.. బీట్ రూట్ రసం యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బీట్ రూట్ రసం రోజూ తీసుకుంటే యవ్వనంగా వుంటారు. బీట్ రూట్ రసాన్ని పరగడుపున తీసుకుంటే శరీరంలో టాక్సిన్లు తొలగిపోయి.. చర్మానికి నిగారింపును చేకూర్చుతుంది. అలాగే బీట్ రూట్‌లోని నైట్రేట్లు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 
 
బీట్‌రూట్ రసాన్ని ప్రతిరోజూ పరగడుపున తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత రోగాల నుంచి విముక్తి పొందవచ్చు. కొలెస్ట్రాల్‌ను కరిగించే సత్తా బీట్ రూట్‌లో వుండటం ద్వారా గుండెపోటు, పక్షవాతం దరిచేరవు. కాలేయం ఆరోగ్యంగా వుండాలి అంటే.. బీట్ రూట్ జ్యూస్ తీసుకోవాలి. కాలేయంలో సెల్స్ ఉత్పత్తికి బీట్ రూట్ భేష్‌గా పనిచేస్తుంది. కాలేయ ఆరోగ్యం కోసం వారానికి రెండు సార్లైనా బీట్ రూట్ జ్యూస్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
లోబీపీ వారికి బీట్ రూట్ రసం ఎంతగానో మేలు చేస్తుంది. కానీ హైబీపీ వున్న వారు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే బీట్ రూట్ జ్యూస్ తీసుకోవాలి. ఇంకా బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు. క్యాన్సర్‌ను దూరం పెడుతుంది. 
 
బీట్ రూస్ రసాన్ని ఎలా చేయాలంటే.. ముందుగా బీట్ రూట్ పైనున్న తొక్కను తొలగించి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జ్యూస్ జార్‌లో వీటిని వేసి జ్యూస్ చేసుకోవాలి. అందులో కాస్త నీరు చేర్చి, పాలు చేర్చుకోవాలి. రుచి కొరకు ఏలకాయ కూడా చేర్చుకుని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.