బుధవారం, 29 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 28 అక్టోబరు 2025 (17:57 IST)

నా చావుకి నా భార్య ఆమె ప్రియుడే కారణం: భర్త సూసైడ్

suicide
తన భార్య తనకు ద్రోహం చేసిందనీ, ఇక ఇలా బ్రతకడం కంటే చనిపోవడమే మంచిదని ఓ భర్త సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనిమిది సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత, అతని భార్య తన ప్రియుడితో పారిపోయింది. దీనితో ఆమె భర్త విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు చూస్తే... ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ కాంట్ ప్రాంతంలోని చనేహ్తి గ్రామంలో భార్య కోమల్‌తో కలిసి వుంటున్నాడు కమల్ సాగర్. ఇత వృత్తిరీత్యా న్యాయవాది. ఐతే తన భార్యకు పెళ్లికి ముందే ప్రియుడు వున్నాడనీ, తనను పెళ్లాక కూడా అతడితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు అతడు ఆరోపించాడు.
 
సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో, తన భార్య కోమల్, ఆమె ప్రేమికుడు విశాల్ తన మరణానికి కారణమని పేర్కొన్నాడు. తన భార్య కోమల్ తనను, తమ ఇద్దరు అమాయక పిల్లలను వదిలి తన ప్రేమికుడు విశాల్‌తో వెళ్లిపోయింది. ఈ ఇద్దరూ నా మరణానికి బాధ్యులు. నా మరణం తర్వాత, పిల్లలను వారి తల్లికి అప్పగించకూడదు అని పేర్కొన్నాడు.
 
కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం, భార్య వల్ల కమల్ చాలా రోజులుగా మానసికంగా బాధపడుతున్నాడు. అతడు అంత బాధపడుతున్నా... అతడి భార్య మాత్రం అదేమీ పట్టించుకోకుండా పిల్లల్ని సైతం వదిలేసి అతడితో లేచిపోయిందనీ, తన సంతోషం కోసం వీళ్లను బలి చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.