ప్రియురాలితో హోటల్ గదిలో వున్న భర్త, పట్టుకుని చెప్పుతో కొట్టిన భార్య (video)
ప్రియురాలితో రహస్యంగా హోటల్ గదిలో ఏకాంతంగా గడుపుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నది అతడి భార్య. భర్తను బైటకు లాగి అతడిని చెప్పుతో కొట్టింది. ఈ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రెహీ జిల్లాలోని డిడోలి పోలీసు స్టేషను పరిధిలో జాతీయ రహదారి పక్కనే వున్న ఓ హోటల్ గది వద్ద గుంపుగా జనం చేరి వున్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటా అని చూస్తే... ఓ వివాహిత తన భర్త మరో స్త్రీతో హోటల్ గదిలో ఏకాంతంగా గడుపుతున్నాడంటూ ఆ గది వద్ద కేకలు వేస్తోంది.
దీనితో గది తలుపులను గట్టిగా కొట్టడంతో వివాహిత భర్త బైటకు వచ్చాడు. దీనితో అతడిను చెప్పుతో కొడుతూ దాడికి దిగింది. అతడు చేతులు అడ్డు పెట్టినా సరే వదలిపెట్టలేదు. స్థానికులు కలుగజేసుకుని భర్తతో పాటు అతడి ప్రియురాలిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేస్కున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.