ఇంటి పనుల విషయంలో గొడవ.. భర్తను అడ్డంగా నరికిన భార్య..
ఇంటి పనుల విషయంలో జరిగిన గొడవలో తన భర్త అరవింద్ సింగ్‌ను కత్తితో నరికి చంపిన కేసులో భార్య చంద్రప్రభ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అక్టోబర్ 12న షార్లెట్‌లోని బాలంటైన్ ప్రాంతంలోని వారి అపార్ట్‌మెంట్‌లో జరిగిందని పోలీసులు తెలిపారు. అరవింద్ సింగ్‌పై ప్రాణాంతక ఆయుధంతో చంద్రప్రభ దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు అభియోగాలున్నాయి.
ఆమె తన భర్తను చట్టవిరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా, దారుణంగా గాయపరిచిందని, మెడకు తీవ్రమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చేర్పించారని పోలీసులు తెలిపారు.
అయితే చంద్రప్రభ దర్యాప్తు సంస్థలకు ఇచ్చిన వాంగ్మూలంలో, సింగ్ గాయం ప్రమాదవశాత్తు జరిగిందని, అల్పాహారం సిద్ధం చేస్తుండగా, చేతిలో కత్తితో తిరగబడి, అనుకోకుండా తన భర్తను నరికివేశానని పేర్కొంది. అయితే, ఇంటిని శుభ్రం చేయడంపై నిరాశతో ఆమె ఉద్దేశపూర్వకంగానే కత్తితో అతనిపై దాడి చేసిందని అరవింద్ సింగ్ చెప్పారు.