జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్
మహిళలను ప్రధానంగా వేధిస్తున్న సమస్య జుట్టు రాలడమే అవుతుంది. జుట్టు పోషణకు మహిళలు ఏవేవో ఆయిల్స్ వాడుతుంటారు. అలాంటి వారు మీరైతే జుట్టు రాలకుండా వుండేందుకు ఉల్లినూనె వాడితే సరిపోతుంది. ఉల్లిపాయలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఉల్లినూనెతో పది నిమిషాలు హెయిర్ మసాజ్ చేస్తే కుదుళ్లకు పోషణ అందుతుంది. జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. ఉల్లిపాయ నూనెతో కుదుళ్లకు మర్దన చేయడం ద్వారా జుట్టు పెరుగుతుంది.
ఈ నూనెతో మర్దన చేయడం వల్ల కుదుళ్లలో రక్తప్రసరణ మెరుగవుతుందని, నూనెలోని పోషకాలు కుదుళ్లలోకి ఇంకుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
చుండ్రు, కుదుళ్లు పొడిబారిపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు.. ఉల్లిపాయ నూనెను తప్పకుండా వాడాలి. ఈ నూనెలోని బయోయాక్టివ్ సమ్మేళనాలు కుదుళ్ల సమస్యల్ని తగ్గించి జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఉల్లిపాయ నూనె జుట్టుకు కండిషనర్‌లా కూడా ఉపయోగపడుతుంది.