పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హత్యకు కుట్రపన్నినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం పవన్ తాజాగా చేపట్టిన రాజోలు పర్యటనలో విజయవంతంగా రెక్కీ నిర్వహించారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో పల్లెపండుగ 2.0ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగానే పవన్‌పై రెక్కీ నిర్వహించారు. ఈ పర్యటనలో ఓ అపరిచిత వ్యక్తి ఈ ఉప ముఖ్యమంత్రి పవన్‌కు అత్యంత సమీపానికి వచ్చినట్టు జనసేన పార్టీ గుర్తించింది.
రాజోలులో శంకరగుప్తం డ్రెయిన్ మూలంగా దెబ్బతిన్న కొబ్బరి తోటల పరిశీలిస్తున్న సమయంలో అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో ఆ తర్వాత కార్యక్రమంలో సదరు వ్యక్తి పవన్ కళ్యాణ్‌కు సమీపంలో సంచరించారు. ఆ వ్యక్తి రాజోలు నియోజవర్గానికి చెందిన వైకాపా కార్యకర్తల అని డిప్యూటీ కార్యాలయానికి సమాచారం అందింది.
దీంతో అధికారులు అతని వ్యవహారశైలి, కదలికలపై అనుమానం వ్యక్తం చేస్తూ, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అతడి కదలికలు, కార్యక్రమానికి రాజీ చేసిన పాస్ అతడికి చేరడంపై సందేహాలను ఎస్పీకి వివరించారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.