Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?
అల్లం శీతాకాలంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి ఎందుకంటే ఇది ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతుంది. ఇంకా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంటువ్యాధులతో పోరాడుతుంది. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇంకా అల్లం క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇలా పలు ఆరోగ్య ప్రయోజనాలు అందించే అల్లంతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. అల్లం పచ్చడిని శీతాకాలంలో తీసుకుంటే.. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
అల్లం - 200 గ్రాములు
ఎండుమిర్చి - 200 గ్రాములు
బెల్లం - 500 గ్రాములు
మెంతులు - ఒక టేబుల్ స్పూన్
ధనియాలు - 4 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 2 టేబుల్ స్పూన్లు
చింతపండు - కొద్దిగా
మినపప్పు - 8 టేబుల్ స్పూన్లు
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
తయారీ విధానం :
ముందుగా కడాయిలో స్పూన్ నూనెతో మెంతులు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసి దోరగా వేయించాలి. వీటిని ప్లేటులోకి తీసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. వీటిని ఓ గిన్నెలో వేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఎండుమిర్చి వేయించాలి. ఆ తర్వాత దీనిని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కొద్దిగా చింతపండు వేయాలి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టాలి. ఆ తర్వాత చింతపండును చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీజార్ తీసుకొని వేయించిన అల్లం, ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి.
ఇందులో చింతపండు రసంతో పాటు పావు కిలో బెల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతే టేస్టీ అల్లం చట్నీ రెడీ. ఈ అల్లం చట్నీకి మళ్లీ పోపు పెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ చట్నీ ఇడ్లీ, దోసె, వేడి వేడి అన్నంలోకి రుచిగా వుంటుంది.