1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Foreign prostitution racket busted in hyderabad

హైదరాబాదులో విదేశీ మహిళలతో వ్యభిచారం.. స్టూడెంట్ వీసాతో వచ్చి..?

prostitution
న్యూ హఫీజ్‌పేట్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌ కాలనీలో జరుగుతున్న ఓ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి తనిఖీలు చేపట్టగా, అక్కడ విదేశీ మహిళలతో వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్ధారించారు. ఈ రాకెట్‌ను లైబేరియా దేశానికి చెందిన డేరియస్ (28) నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
 
2021లో స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చి, స్థానికంగా ఓ కళాశాలలో ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నాడు. కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళలతో ఇతడు ఈ దందాను నడిపిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుడు డేరియస్‌తో పాటు నలుగురు విదేశీ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4 వేల నగదు, కొన్ని సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 
 
నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా, ప్రధాన నిందితుడైన డేరియస్‌ను రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.  హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
తర్వాతి కథనం
దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు సమయం ఆసన్నమైంది : పవన్ కళ్యాణ్