ఆదివారం, 16 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 15 నవంబరు 2025 (19:23 IST)

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Sridevi Appalla, Femina George, Vijay Bulganin
Sridevi Appalla, Femina George, Vijay Bulganin
కోలీవుడ్‌లో రీసెంట్‌గా ‘జో’ అంటూ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించిన నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. ఈ సంస్థ నుంచి తదుపరి ప్రాజెక్ట్ ప్రొడక్షన్ నెంబర్ 3ని ప్రారంభించారు. తెలుగు-తమిళ్ అంటూ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటోంది. ‘కోజిపన్నై చెల్లదురై’,  ‘కానా కానమ్ కాలంగల్’ వంటి వాటిలో అద్భుతమైన నటనను కనబర్చి అందరినీ ఆకట్టుకున్న ఏగన్, ‘కోర్ట్’ చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న శ్రీదేవీ, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రల్ని పోషించనున్నారు. ఈ చిత్రం గురించి మేకర్స్ ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
 
ఈ ప్రాజెక్ట్‌కు రీసెంట్ సెన్సేషన్ విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘బేబీ’, ‘కోర్ట్’ అంటూ వరుసగా బ్లాక్ బస్టర్, చార్ట్ బస్టర్ మ్యూజిక్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ ఇవ్వనున్నారు. ‘ఆహా కళ్యాణం’ దర్శకత్వం వహించిన యువరాజ్ చిన్నసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
 
‘జో’ విజయం తర్వాత విజన్ సినిమా హౌస్ మంచి సబ్జెక్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్ని అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే నిర్మాతలు డా. డి. అరుళనందు, మాథ్యూయో అరుళనందు క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించేందుకు సిద్దంగా ఉన్నారు.త్వరలోనే సినిమాకు సంబంధించిన ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు.