పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటికే తమిళనాట విజయ్ రాజకీయాల్లోకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడతారా అనే ఊహాగానాలు పెరుగుతున్నాయి.
దీనిపై పవన్ మీడియాతో మాట్లాడుతూ, వారాల తరబడి ఊహాగానాలకు ముగింపు పలికారు. తమిళనాడులో తన రాజకీయ ఆశయాల గురించి పవన్ మాట్లాడుతూ.. ఎన్డీఏ భాగస్వామిగా, ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేసినా, నేను నా మద్దతును అందిస్తానని నిర్ధారించుకోవడం నా ప్రాథమిక బాధ్యత. అది ఎన్డీఏ పట్ల నా నిబద్ధతలో భాగం." అంటూ చెప్పుకొచ్చారు.
జనసేనకు కొన్ని పరిమితులు ఉన్నాయని కూడా పవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ దాటి తనకు వ్యక్తిగత ప్రజాదరణ ఉన్నప్పటికీ, తన పార్టీ జనసేన ప్రస్తుతం తమిళనాడులో స్వతంత్రంగా పోటీ చేయడానికి సిద్ధంగా లేదని పవన్ స్పష్టం చేశారు.
జనసేనగా, మనం జాతీయ పార్టీలతో పోటీ పడలేమని నేను భావిస్తున్నాను. ఇది చాలా కఠినమైన పని. బహుశా నేను జాతీయంగా ప్రసిద్ధి చెంది ఉండవచ్చు. కానీ ఒక పార్టీగా, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. పార్టీని అభివృద్ధి చేయడానికి, ఆ దశకు వెళ్లడానికి, బహుశా మరికొన్ని దశాబ్దాలు పట్టవచ్చు.. అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.