ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)
కొంతమంది బుర్ర వుండే చేస్తారా అంటున్నారు రైలు ఏసీ కోచ్‌లో ఓ మహిళ చేసిన నిర్వాకం చూసిన నెటిజన్లు. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందో తెలుసా? రైలు ఏసీ బోగీలో సెల్ ఫోన్ చార్జ్ చేసుకునేందుకు ఇచ్చిన ప్లగ్ పాయింటులో కెటిల్ పెట్టి నీళ్లు కాచింది. ఆ వేడి నీటిలో మ్యాగీ నూడుల్స్ వేసి వేడివేడి మ్యాగీ తయారుచేసింది. అది చాలదన్నట్లుగా తను చేసిన నిర్వాకాన్ని వీడియో తీసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేమైనా కిచెన్ రూం అనుకున్నారా... ఏమాత్రం తేడా జరిగినా అగ్నిప్రమాదం సంభవిస్తుంది. ఇలాంటివారి వల్లనే ఇతరులు కూడా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు అంటూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు రైలులో ఇలా కెటిల్ ఉపయోగించి నూడుల్స్ చేసిన మహిళపై రైల్వే శాఖ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టప్రకారం సదరు మహిళపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.