శనివారం, 22 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 22 నవంబరు 2025 (17:25 IST)

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

Bunny Vas
Bunny Vas
నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తున్నారు బన్నీ వాస్. ఆయన తాజాగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్బంగా టికెట్ రేట్స్ పెంపు, పైరసీపై ఆయన మాట్లాడారు. ఐ బొమ్మ రవిని కొందరు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్న విషయంపై బన్నీ వాస్ స్పందించారు. 
 
ఆయన మాట్లాడుతూ - పైరసీ తప్పు. అలాంటి తప్పును తమకు లాభం కలిగిందని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్. ఏడాదిలో పదో పదిహేనే సినిమాలకే టికెట్ రేట్స్ పెంచుతున్నారు. కానీ ఆ సినిమాలకే కాకుండా మిగతా అన్ని చిత్రాలు పైరసీకి గురవుతున్నాయి. ఆస్తులు అమ్మి సినిమాలు చేస్తున్న ఎంతోమంది చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. పైకి నిర్మాతలు బాగానే కనిపిస్తున్నా, వెనక వారికి బాధలెన్నో ఉంటాయి. అన్నారు.