G20 శిఖరాగ్ర సమావేశం.. జోహెన్స్‌బర్గ్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం (video)
ప్రపంచ అనిశ్చితి, భౌగోళిక రాజకీయ అంతరాల మధ్య ఏర్పడిన G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జోహన్నెస్‌బర్గ్‌లో అడుగుపెట్టారు. దక్షిణాఫ్రికా ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇద్దరూ ఈ సదస్సు హాజరు కావట్లేదు.
ఈ సందర్భంగా జోహెన్స్‌బర్గ్ గౌటెంగ్‌లోని వాటర్‌క్లూఫ్ వైమానిక దళ స్థావరంలో, మోదీకి సాంస్కృతిక ప్రదర్శనలతో సాంప్రదాయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా G20 శిఖరాగ్ర సమావేశాలకు సంబంధించిన కార్యక్రమాల కోసం జోహన్నెస్‌బర్గ్‌లో అడుగుపెట్టాను. కీలకమైన ప్రపంచ సమస్యలపై ప్రపంచ నాయకులతో ఉత్పాదక చర్చల కోసం ఎదురు చూస్తున్నాను. సహకారాన్ని బలోపేతం చేయడం, అభివృద్ధి ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడం, అందరికీ మెరుగైన భవిష్యత్తును నిర్ధారించడంపై మా దృష్టి ఉంటుంది.. అని ఎక్స్ ద్వారా నరేంద్ర మోదీ పోస్టు చేశారు.
ఇది ఆఫ్రికన్ గడ్డపై జరుగుతున్న మొదటి G20 శిఖరాగ్ర సమావేశం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అనేక మంది నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా సహా ఐబీఎస్ఏ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు.