భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది
భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, తను మరణించి ప్రయాణికులను రక్షించింది. కొత్తగూడెం రైల్వే స్టేషనులో నాటు బాంబు పేలుడు సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్టేషను ఒకటో నెంబరు ఫ్లాట్ ఫార్మ్ పైన బాంబుతో కూడి వున్న సంచిని కుక్క కొరికింది.
అంతే...భారీ శబ్దంతో పేలిన బాంబు ధాటికి కుక్క ఎగిరి రైల్వే ట్రాక్ పైన పడింది. ఈ శబ్దంతో భయాందోళనలతో ప్రయాణికులు పరుగులు తీసారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ బాంబును రైల్వే స్టేషనులో ఎవరు పెట్టారన్నది సీసీ కెమేరాల ద్వారా పరిశీలిస్తున్నారు. కాగా తను చనిపోయి మమ్మల్ని కాపాడిందంటూ రైలు ప్రయాణికులు చెప్పుకుంటున్నారు.